బాధలను భరించక
మనోవ్యధలను సహించక
మొక్కవోని ధైర్యంతో
తెగించి హక్కుల్ని హరించే
వారి రెక్కల్ని విరిచేయడం..!
ఎదుటివారి
ఎదుగుదలను
చూసి ఏడవకపోవడం...
చెడును ద్వేషించడం...
నలుగురిని నవ్వించడం...
శత్రువులను ప్రేమించడం..!
జాలి దయ కరుణను కురిపించడం...
ముసిముసి నవ్వులతో మురిపించడం
ఈ సుగుణాలు కలిగిన ప్రతిమనిషి ఒక
మహాత్ముడే మహనీయుడే మహర్షియే..!
వరాల వరద..?
ఒక వ్యక్తికి
కాలిలో ఒక చిన్న
ముల్లు గ్రుచ్చుకుంటే
కలిగే బాధకు...
ఒక పదునైన కత్తితో
కసిదీరా కడుపులో
పొడిస్తే కలిగే బాధకు...
గురిపెట్టి గన్నుతో కాలిస్తే
గుండెల్లో బుల్లెట్ దూరితే
కలిగే బాధకు...
తలపై సుత్తెతో
ఒక దెబ్బ కొడితే
కలిగే బాధకి...
వెయ్యి దెబ్బలు కొడితే
కలిగే బాధకు వ్యత్యాసం...
ఆవగింజంత...ఆకాశమంత..!
ఒక వ్యక్తికి
వివాహం...జరిగితే ఒక ఆనందం
సంతానం...కలిగితే ఒక ఆనందం
ఉద్యోగమొస్తే...ఒక ఆనందం
ప్రమోషనొస్తే...పరమానందం
సమయ సందర్భాభాలతో
పొందే ఆ సంతోషం...ద్విగిణీకృతం..!
మొన్న...
కాలినడకన వెళ్ళిన వ్యక్తి
నిన్న...బైక్ లో
నిన్న...కారులో తిరిగిన వ్యక్తి
నేడు...రైల్లో
నేడు...సముద్రంలో షిప్ లో
రేపు....విదేశీ విమానంలో...
అదే కదా ఆ భగవంతుడు
ప్రసాదించే వరాల మహిమంటే..!
అదే కదా ఉన్న స్థితి నుండి
ఉన్నత స్థితికి చేరుకోవడమంటే..!
అదే కదా అగాధం నుండి
ఆకాశమంత ఎదగడమంటే..!
అట్టివారే కదా అదృష్టజాతకులంటే..!



