ఎక్కడికి నీ ప్రయాణం..? అక్కడికే..!
ఎక్కడ...
మంచితనం
మానవత్వం పరిమళిస్తుందో....!
ఎక్కడ...
న్యాయం ధర్మం
సమానత్వం సౌబ్రాతృత్వం
గులాబీలై గుభాళిస్తున్నాయో...!
ఎక్కడ...
యుద్దభీతిలేక
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు
శాంతికపోతాలై
గగనతలాన విహరిస్తున్నాయో..!
ఎక్కడ...
రక్తపాతచరిత్ర లేక
ప్రేమ సజీవనదిలా ప్రవహిస్తున్నదో..!
అక్కడికే నా ఈ ప్రయాణం..!



