ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
ఎవరైనా ఎప్పుడైనా
ఏదైనా కొండంత ఆశతో నోరు
తెరిచి నిన్ను చిరుసహాయాన్ని అర్ధిస్తే...
కఠినంగా కాదనకు...ఉండి లేదనకు....
నీవు జాలి దయ కరుణగల
సహృదయం ఉన్నవాడివని...
ఆపదంటే...అవసరముంటే...
ఆదుకునే ఆపధ్భాంధవుడివని...
ఎంతో ఆశతో నమ్మకంతో నీ దగ్గరికొచ్చిన
నీ ప్రాణమిత్రుల్ని...
ఇరుగుపొరుగువార్ని...
చులకనగా చూడకు..!
తక్కువ చేసి మాట్లాడకు..!
మానసిక క్షోభకు గురిచేయకు..!
సకాలంలో సహాయం చేయకపోగా
సూటిపోటి మాటలతో వేధించకు..!
బాధించకు బిక్షగాళ్ళలా భావించకు..!
నిందించకు...నిరాశకు గురిచేయకు..!
ఎప్పుడైనా...
ఎవరైనైనా...ఎదురు పడితే
చిరునవ్వులు...చిలకరించు..!
ఆత్మీయంగా గౌరవంగా పలకరించు..!
"నమస్కారం" చేస్తే...
"ప్రతినమస్కారం" చేయడం మన
"భారతీయ సంస్కృతీ సాంప్రదాయం...!
ఇచ్చి పుచ్చుకోవాలి..! "గౌరవం"
"గౌరవం" ఒక ఘనత..! ఒక చరిత..!
ఏ ప్రతిఫలమాశించక చేయాలి..!
" సకాలంలో సహాయం"
"సహాయం"...ఒక సంపద...ఒక సంతృప్తి..!



