Facebook Twitter
కడిగిన ఆణిముత్యాలం..!

మనం
ఆరోగ్యకరమైన
ఆనంద మయ
జీవితం గడపాలంటే..?

మనపై
నిర్దాక్షిణ్యంగా
నీలాప నిందలు
మోపిన వారిని...

విమర్శల విషాన్ని
విరజిమ్మిన వారిని...


మన జీవితంలో
నిప్పులు పోసిన వారిని...
మనం క్షమించలేని వారిని...
పూర్తిగా మర్చిపోవాలి..!

మరచి పోలేనినాడు
వారిని క్షమించి వారి
ఖర్మకు వారిని వదిలెయ్యాలి...
మనలో ఏవైనా
లోపాలుంటే సరిదిద్దు కోవాలి..!
మన మనసులోని
మలినాలను శుద్దిచేసుకోవాలి..!

తెలిసి తెలియక
ఏవైనా ఘోర తప్పిదాలు
చేసివుంటే శిక్షించుకోవాలి..!
అప్పుడే మన జీవితం స్వర్గతుల్యం..!
అప్పుడే మనం కడిగిన ఆణిముత్యాలం..!