Facebook Twitter
విధి నిర్ణయించిన వింత ప్రయాణం..?

మనిషి జీవితంలో
ముఖ్యమైన దశలు...మూడు
బాల్యం...యవ్వనం...వృద్ధాప్యం

బాల్యంలో ఇంటి నుండి...
బడికో కాలేజీకో...విద్యార్థిగా
యవ్వనంలో...
ఆఫీసుకో...ఉద్యోగిగా
వృద్ధాప్యంలో...
అనాధాశ్రమానికో...అనాధగా
కాదంటే కన్నుమూసి
కాటికో...ఒంటరిగా...

మధ్యలో మనిషైనా
ఇంటి నుండి... విదేశాలలో
ఉన్నత చదువులకోసం
ఉద్యోగం కోసం...విద్యార్థిగా

గ్రంధాలయానికో...
విజ్ఞానం కోసం జ్ఞాన పిపాసిగా...
దేవాలయానికో ... గుడికో
పుణ్యక్షేత్రానికి...భగవంతునిపై
భక్తి శ్రద్ధలతో ముక్తికోసం...ఒక భక్తునిగా

విహారయాత్రకో...
వినోదంలో మునిగితేలేందుకు
కాసింత మానసిక శాంతి కోసం...
ఉల్లాసం కోసం ఉత్సాహం కోసం...
ప్రశాంతత కోసం...ఒక టూరిస్ట్ గా...

జైలుకో... కోర్టుకో...
వివాదాలలో చిక్కుకొని విషాదంగా...

సాగించక తప్పదు...ఇంటి నుండి
సుఖ దుఖాల...
చీకటి వెలుగుల...
ఎగుడు దిగుడుల...ఎత్తుపల్లాల...
విధి నిర్ణయించిన వింత ప్రయాణం...