ఎంతో
కాలంగా
ఆదరణలేక
రాళ్ళతో రత్నాల్లా...
మట్టిలో మాణిక్యాల్లా...
అంధకారంలో దాగివున్న
కవులను ప్రోత్సహిస్తున్న...
కొందరు కలాల కాగడాలతో...
సామాజిక రుగ్మతల్ని రూపుమాపి
కొందరు కలాల కత్తులతో...
అన్యాయాలను అక్రమాలనెదిరించి
కొందరు మనువాదుల మతోన్మాదులపై
కలాల కొరడాలను ఝులిపించి...
దురాచారాలను సమాధి చేసే...
సమసమాజానికి పునాది వేసే...
కసాయిలను సైతం తమ కవిత్వంతో
కదిలించే...కనువిప్పు కలిగించే...
కవులనాదరిస్తున్న...గుర్తింపునిస్తున్న...
కాలగర్భంలో కలిసిపోతున్న
కారు చీకటిలో కాంతి రేఖలైన
కవితలను వెలుగులోనికి తెస్తున్న...
మంచి మనసున్న...
అంకిత భావంతో
సా్హితీ సేవ చేస్తున్న...
అధిక భారం మోస్తున్న...
పత్రికా ప్రపంచంలో రాణిస్తున్న...
మకుటంలేని
మహారాజులు...
కళాపోషకులు...
సాహిత్యాభిమానులు...
సంపాదక శిఖామణులైన
ఎందరో మహానుభావులు...
అందరికీ వందనాలు అభివందనాలు...



