నా భాష తెలుగు భాష
నేను తెలుగువాన్ని
నా భాష తెలుగు భాష
అక్షరాలు యాబైఆరే
నా తెలుగుజాతికి వరాలు
ఆ అక్షరాలే...
నా తెలుగుతల్లి సిగలో సిరిమల్లెలు...
నా కవులు
వ్రాసిన పద్యాలే...
నా తెలుగు తల్లి
పూజకు సమర్పించిన పుష్పాలు...
నా తెలుగు పండితులు
లిఖించిన కావ్యాలే...
బృహత్ గ్రంథాలే...
నా తెలుగు తల్లికి
అలంకరించిన పట్టు వస్త్రాలు...
నా తెలుగు
సంస్కృతే...
నా తెలుగు తల్లి
నుదుట దిద్దిన కుంకుమతిలకం...
నా తెలుగు
సాంప్రదాయాలే...
నా తెలుగుతల్లికి
వెలకట్టలేని బంగరుఆభరణాలు...
నా తెలుగు...
గాయనీగాయకులు
ఆలపించిన ఆ మధురగీతాలే
నా తెలుగు తల్లి
మెడలో మెరిసే పూలహారాలు...
అందుకే
ఓ నా తల్లీ..!
నీకు ప్రణామం ..!
ప్రణామం...ప్రణామం..!
ఓ తెలుగు తల్లి నీకు వందనం..!
అభివందనం పాదాభివందనం..!



