Facebook Twitter
అక్షరకు సుమాంజలి

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
కెక్కేలా నభూతో న భవిష్యత్ అన్నరీతిలో...

కవులతోభారీగా సాహితీ సమ్మేళనాల
సభలను సమావేశాలను
నిర్విఘ్నంగా నిర్వహించే
సభాసామ్రాట్...బాహుబలి...
ఘనుడు...త్యాగధనుడు...
అసాధ్యాల్ని
సుసాధ్యం చేసే అఖండుడు...
సాహసకృత్యాల సింహబలుడు...

తెలుగుజాతి జ్యోతి...
తెలుగు భాషకు ఆభరణం...
తెలుగు కవులకు ఆశాకిరణం...
తెలుగు తల్లికి మంగళ తోరణం...
తెలుగు భాషకు వెలుగు కిరణం...
తెలుగు జాతికెంతో గర్వకారణం...

రెండుతరాల కళాకారులకు వారధి...
మన తెలుగుభాషకు ప్రచారరథసారథి...
మన తెలుగుభాష ఉద్యమానికి
ఊపిరైన కళారత్న బిక్కికృష్ణ గారికి
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

సందర్భంగా శుభాకాంక్షలతో....
"శతమానం భవతీ" అంటూ దీవిస్తూ...
అందించే అక్షర కుసుమాంజలి