Facebook Twitter
ఆ స్నేహం అమృతం..?

మనలోని
మంచితనం...
మానవత్వం...
సహనం.........
సౌభ్రాతృత్వం...

నీతి నిజాయితీ...
సభ్యతా సంస్కారం...
సేవా దృక్పథం...త్యాగ గుణం...
ఎలా ఉండాలి..? ఇదిగో ఇలా...!

మన బద్దశత్రువు సైతం
తాను ఒక మంచి మిత్రున్ని
దూరం చేసుకున్నందుకు దుఃఖించేలా..!

అమృతసమానమైన మన స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించేందుకు
ప్రతిదినం ప్రతిక్షణం పరితపించేలా....!

ఎప్పుడైనా ఎక్కడైనా మనం
ఎదురుపడితే చిరునవ్వు నవ్వి
ఆప్యాయతతో ఆలిగనం చేసుకొని
హృదయానికి గట్టిగా హత్తుకునేని
ఆనందంతో పరమానందంతో అంతులేని
సంతోషంతో పులకించిపోయేలా ఉండాలి!