Facebook Twitter
నీ నీడనడుగు నిజం చెబుతుంది..!

"ఆకాశాన్ని"...అడుగు
నేను ఒంటరినా..? అని
లేదు లేదు నిత్యం నీ తలపై
గొడుగునై నీకు తోడై ఉంటానంటుంది...

"
నేలను"...అడుగు
నేను ఒంటరినా..? అని
లేదు లేదు నీ అడుగు అడుగుకు
తీవాచీనై నిత్యం నీతో ఉంటానంటుంది...

"
నీరును"...అడుగు
నేను ఒంటరినా..? అని
లేదు లేదు నీకు దాహం వేసినప్పుడు
ప్రతినిత్యం నీకు దర్శనమిస్తానంటుంది...

"
గాలిని"...అడుగు
నేను ఒంటరినా..? అని
లేదు లేదు నీ ఉచ్ఛ్వాస నిచ్చ్వాసాల్లో
ప్రతిక్షణం నీకు ఊపిరినై ఉంటానంటుంది..

"
అగ్నిని"...అడుగు
నేను ఒంటరినా..? అని
లేదు లేదు ఉదయించే
లేలేత సూర్య కిరణాలలో
నిత్యం నీకు వెలుగునై ఉంటానంటుంది...

నీ "నీడను"...అడుగు
నేను ఒంటరినా..? అని
లేదు లేదు చివరి వరకు చితికి
చేరేవరకు నీ వెంటే నేనుంటానంటుంది...

నా కర్థమైంది నేను ఒంటరిని కానని...
నా వెంట పంచ భూతాలున్నాయని...