Facebook Twitter
ఆ ముగ్గురిని...?

ప్రేమకు...
పరమాత్మకు...
అమాయకత్వానికి...
"
గతంలోని"తీపిజ్ఞాపకాలకు
"ప్రతిరూపాలైన...
"
చిన్నపిల్లలను"...ప్రేమించు...

ఉడుకు రక్తం ఉప్పొంగే
ఉత్సాహంతో ఉరకలేసే
పరుగుతీసే నీ తోటివారితో...
నేటి "వర్తమానానికి" ప్రతీకలైన...
"
యవ్వనస్తులతో "...పోటీపడు...

కుటుంబం కోసం...సమాజం కోసం...
దేశంకోసం...సర్వం త్యాగం చేసి...

ఆర్జించిన ఆస్తిని కుటుంబీకులకు...
అంతులేని అనుభవాన్ని
జ్ఞానాన్ని ముందుతరాలకు పంచి...

రెక్కలు విరిగిన పక్షులుగా...
ఆదరణ నోచుకోని అనాధలుగా...
ఆకలికి అలమటించే అస్తిపంజరాలుగా...
నేడోరేపో రాలిపోయే ఎండుటాకులుగా...

కాటికి కాళ్ళు చాపుకుని
పరమాత్మ పిలుపు కోసం
ప్రతిక్షణం ఎదురు చూస్తూ...
రేపటి "భవిష్యత్తుకు"
ప్రతిబింబాలైన...వృద్ధులను..
గౌరవించు...పూజించు...
చిరునవ్వుతో...పలకరించు...
ఆప్యాయంగా...ఆలింగనం చేసుకో
ప్రతినిత్యం స్మరించు...ప్రత్యక్ష దైవాలుగా