Facebook Twitter
ఆత్మ శాంతికి ఆరు గ్యారంటీలు..?

నేస్తమా
ఎప్పుడైనా
ఏదైనా అనుకోని
కలనైనా ఊహించని
ఒక హఠాత్సంఘటన
మన ప్రమేయం లేకుండా
జరిగి విధి విషం
చిమ్మితే విలపించకు...
విషాదంలో మునిగిపోకు...

నీ మదిలోని
ఆందోళనకు
అశాంతికి ఒత్తిడికి
అకారణంగా వచ్చే కోపానికి
ఏదో తెలిసీ తెలియక చేసిన
చిన్న తప్పుకు నీ మనస్సాక్షి విధించే
మానసిక శిక్ష నుండి బయటపడేందుకు
చింతలు తీరేందుకు చిట్టి చిట్కాలు...కొన్ని

1. ఒక గంట ఒంటరిగా ఒక రూంలో
కూర్చుని యోగ ధ్యానం చెయ్...
ఏవైనా జోక్స్ పుస్తకాలు చదువు...
నీవు మాట్లాడక మౌనంగా ఉండు...

2.
జరిగిన గొడవ /ఘర్షణ /
దుస్సంఘటన వ్యక్తుల/
వస్తువుల గురించి అదేపనిగా
పదేపదే...ఆలోచించకు...

3.
నీతో గొడవ పడివ వ్యక్తితో
వెంటనే కల్పించుకొని మాట్లాడు...
ఫోన్లో ఐతే ఇంకా మంచిది...

4.
విరగబడి పగలబడి నవ్వే
జబర్దస్త్ లాంటి మంచి కామెడీ
ఉన్న టీవీ ప్రోగ్రాంలు చూడు...
ఒక కామేడీ సినిమా థియేటర్లో చూడు

5. నీకు బాగా ఇష్టమైన కమ్మని
పాటలు నాన్ స్టాప్ గా ఒక గంట విను

6. గొడవ/దుస్సంఘటన జరిగిన
ప్రదేశానికి/ వ్యక్తులకు సుదూరంగా
విహార యాత్రకు వెళ్లి కొంతకాలం గడుపు

నీ మనశ్శాంతికివే నా ఆరు గ్యారంటీలు