వెతికేవాడు వెర్రివాడు..?
విలువైన జీవితాన్ని
వెతికేవాడు వెర్రివాడు..!
సద్బుద్ధితో...
సత్సంకల్పంతో...
ఉదాత్తమైన లక్ష్యంతో...
పటిష్టమైన ప్రణాళికతో...
ఉన్నతమైన ఆశయంతో...
సుందరమైన సౌధంలా
నిర్మలమైన జీవితాన్ని
నీతిగా నిర్మించుకున్న వాడే
అందరికి ఆదర్శప్రాయుడు..!
చీకటిలో
చిక్కుకుని
చింతిస్తూ
కూర్చున్నోడు
తిక్కశంకరుడే...!
చిరుదీపం వెలిగించి
చీకట్లను చీల్చినవాడే...
వీరుడు...ధీరుడు...శూరుడు...
విక్రమార్కుడు విజ్ఞానవంతుడు.!
ఆనందమయ
జీవితాన్ని ఆశించి
విహారయాత్రలు చేస్తూ
వినోదంలో విలాసాలలో
మునిగితేలేవాడు అజ్ఞాని..!
ఇతరులను
ఆకర్షించడంలోనే...
ఆదరించడంలోనే...
ఆనందపరచడంలోనే...
అన్నార్తుల
ఆకలి తీర్చడంలోనే...
ఆపదలో అత్యవసరాల్లో
ఉన్నవారిని ఆదుకోవడంలోనే...
ఆనందం దాగి ఉందన్న గొప్ప
సత్యాన్ని ఎరిగినవాడు జ్ఞాని..!



