మళ్ళీ మళ్ళీ...
పునరావృతం
కాకుంటే బావుండు...
ఈ మూడు...
అల్పపీడనాలు..!
నిద్ర...
ఆకలి...
దాహం...
మళ్ళీ మళ్ళీ
మనసుకు
గుచ్చుకోకపోతే
బావుండు...
ఈ ముళ్ళు..!
బాధ...
భయం...
దిగులు...
కష్టాలు...
కన్నీళ్లు...
వ్యాధి...
వ్యధ...
రోదన...
వేదన...
ఆవేదన...
ఆందోళన...
ఆగని దుఃఖం...
మానసిక క్షోభ...
మళ్ళీ మళ్ళీ
పండుతూ ఉంటే
బావుండు
ఈ పచ్చని పంటలు..!
సుఖము...
ఆనందము...
సంతోషము...
సంపూర్ణ ఆరోగ్యం...
శాంతి సమాధానం...



