Facebook Twitter
శాశ్వత విముక్తి...?

1...
కులం...
ఎవరికి బరువైంది
ఎవరి బ్రతుకు
అంధకారమైంది
మతం...ఎవరికి
బ్రతుకు తెరువైంది

కులం పేర కుమ్ములాటలు
మతం పేర మారణహోమాలు
ఎందుకు ఎందుకు..?
ఎంతకాలం..? ఎంత కాలం.
ఇంకెంత కాలం..?

నిజానికి
ఇవన్నీ పచ్చినిజాలే...
రెండు... కళ్ళకు
కనిపించని భూతాలే...
తరతరాలుగా
బలహీనుల తలలపై
తైతక్కలాడుతున్నవే...
తాండవమాడుతున్నవే...
అథఃపాతళానికి అణగద్రొక్కినవే...

ఇవి పచ్చినిజాలని...
తాడిత పీడిత
బడుగు బలహీన
బహుజన మైనారిటీ
వర్గాల జనులు
ఖచ్చితంగా తెలుకున్న నాడే...
చైతన్య వంతులైన నాడే...

2...

తాము
ఏదో భ్రమలో...బ్రాంతిలో
ఏదో మత్తులో...మాయలో
లోకంలో అవేకంలో...అజ్ఞానంలో
అగ్రవర్ణాల ఆధిపత్యంలో...
ఇంకెంత కాలం...పంజరంలో
పక్షుల్లా బంధీలమై ఉండాలని...

పెదవులతో పైకి బ్రతకాలంటూనే
వెనుక వెన్నుపోటు పొడిచే
మతోన్మాదుల కుట్రలు
కుతంత్రాలు...అర్థమైననాడే...

బానిసత్వపు బ్రతుకులు
ఇంకెంత కాలం ఇంకెంత కాలమని
తమలో తాము ప్రశ్నించుకున్న నాడే...

దశాబ్దాలుగా శతాబ్దాలుగా...
బీదబిక్కికి మనువాదులు వేసిన
ఇనుప సంకెళ్ళు నుండి శాశ్వతవిముక్తి...