ఆపధ్భాంధవుల అడ్రస్..?
ఒక రోజు ఆకలి తీర్చే కన్న...
ప్రతిరోజు ఆకలి తీర్చుకునే
మార్గాన్ని చూపడం మిన్న...
చిరు సలహాలు
సూచనలు చేసే కన్న...
ఒక సమస్యకు శాశ్వత
పరిష్కారం చూపడం మిన్న...
అర్థం చేసుకోవడం కన్న...
అపార్థం చేసుకోకపోవడం మిన్న...
చిరు సహాయం చేసే కన్న...
భారీ సహాయం అందించే...
ఉదార హృదయం దయ జాలి
మంచులా కరిగే మనస్తత్వం గల
ఆపధ్భాంధవుల అడ్రస్ చెప్పడం మిన్న...



