నిన్న నీ చేయి పట్టుకొని
నడిపిన మీ నాన్నను
మరవొద్దు...ఎందుకు..?
నీకో బంగారులోకం
చూపించినందుకు...
ప్రశాంతంగా బ్రతకమని నీ
వెంటే నేనున్నానని...నీకేం కాదని
బ్రతుకు బరోసా నిచ్చినందుకు...
నేడు నీ చేయి పట్టుకొని
నడుస్తున్న నీ బిడ్డ చేతిని
వదలొద్దు...ఎందుకు...?
ఎప్పుడైనా ఏక్కడైనా...
విధి వశాత్తూ విడిపోయినా
చేజారి పడిపోయినా కడలిలోని
కెరటంలా తిరిగి పైకి లేపడానికి...
నిన్న నీ భుజం తట్టి
భయపడకన్న మీ నాన్న
మాట మరవొద్దు...ఎందుకు..?
ముందు జీవితంలో
ముళ్ళుంటాయి...రాళ్ళుంటాయి
ఎత్తూపల్లాలుంటాయి...
కష్టాలుంటాయి...కన్నీళ్లుంటాయి
ఎన్నో అవరోధాలుంటాయి
స్పీడ్ బ్రేకర్లుంటాయి...అవి దాటితే...
బ్రతుకు పూలతోటని...వెన్నెల బాటని...
నేడు నీ బిడ్డ భుజం తట్టి చెప్పు
భయపడొద్దని...ఎందుకు..?
ముందు జీవితమంతా
అయోమయమని...అంధకారమని
సాహసమే ఊపిరిగా సాగిపొమ్మని...
ఆపై తన జీవితం
వెలుగుమయమని...వెన్నెలమయమని...
సుందరమని సుమధురమని శుభకరమని



