ప్రేమపక్షి...ప్రేమబిక్ష..?
"ప్రేమబిక్ష" కోసం...ఓ
"ప్రేమపక్షి" విశాల విశ్వంలో
స్వేచ్ఛగా విహరించడం కోసం
చిన్న చిన్న అబద్ధాలు ఆడవచ్చు
కానీ "స్వచ్చమైన ప్రేమ"
"పచ్చి అబద్ధం" కారాదు...
అపార్థం "ఆరని నిప్పు" కారాదు...
అనురాగం "అగ్ని గుండం" కారాదు...
ఐతే ఇక అనర్థమే...బ్రతుకు నరకమే...
ఇద్దరి మధ్య అగాధమే అంతర్యుద్ధమే...
ఎప్పుడైనా ఏర్పడవచ్చు...
అపార్థాల అల్పపీడనం...
ఆపై "వాయుగుండమే"...
తీరం దాటితే తీవ్ర తుఫానే...
బ్రతుకు "దినదిన గండమే"...
ఇద్ధరి మధ్య భీకర "యుద్ధమే"...
ఆవేశంలో...అయోమయంలో... ఆత్మహత్యలకు "సంసిద్దమే"...
ఓడమి గెలుపుకు దారి కావొచ్చు
కానీ చచ్చిపోయి సాధించేదేమీలేదు
ఈ సత్యం తెలుసుకోవాలి ప్రతి"ప్రేమపక్షి".



