జీవితం ఒక నందన వనం..!
జీవితం
పుట్టుకతోనే
పూలవనం కాదు...
కానీ
ఆశపడి...
భ్రమపడి...కాక
ఒక ఆశతో...
ఒక లక్ష్యంతో ...
ఒక ఆశయంతో...
పటిష్టమైన ప్రణాళికతో...
ఉన్నతమైన ఒక ఆలోచనతో...
ఇష్టపడి...కష్టపడి నప్పుడు.....
కాకపోదు...
మీ ముందు జీవితం
ఒక విందు భోజనం...
కాకపోదు...
మీ ముందు జీవితం
అందమైన
అతి సుందరమైన
పరిమళించే నవ్వుల
పువ్వుల నందనవనం...
కాకపోదు...
మీ ముందు జీవితం
ఆ అంబరాన్ని తాకే
సంతోష సంబరాల సాగరం...
కాకపోదు...
మీ ముందు జీవితం
అందాల...ఆనందాల...బృందావనం...
హరితం...నవనీతం...నవరస భరితం...



