Facebook Twitter
ఒక మాట..! ఒక మౌనం..! ఒక చూపు..!

ఒక చెడు మాట...
ఒక చెడు చూపు...
ఒక మౌనవ్రతం
మూడు విషబీజాలు...!

ఇవే మనిషికి అత్యంత
శక్తిమంతమైన "ఆయుధాలు"
మాట....ఒక తూటా అంటారు..!
మౌనం...ఒక మంత్రమంటారు...!
చూపు...ఒక చుక్కాని అంటారు..!

ఒక మంచిమాట...ఒక మంత్రదండం..!
ఒక చెడు చూపు...ఒక విష ప్రయోగం..!
ఒక మౌనవ్రతం.....ఒక మన్మధ బాణం..!

ఇవే మనిషికి త్రినేత్రాలు..!
త్రిమూర్తుల...ఆశిస్సులతో
త్రికాలాలలో...ప్రయోగించే త్రిశూలాలు..!