ఆశతో ఒక వృద్ధుడు
పండ్లమొక్క ఒకటి నాటాడు
రేపో మాపో రాలిపోయే ఈ
పండుటాకుకెందుకింత ఆశ...
మొక్క ఎదిగేదెప్పుడు
పండ్లు కాసి తినేదెప్పుడని...
నలుగురు నవ్వారు...
తనకు తెలుసు నవ్విన నేమి...
నాపచేను పండునని తనకోసం కాదని...
ఆ మొక్క తనముందు తరాల కోసమని...
వృద్దుడు ఆపై మట్టిలో కలిసేను
మట్టిలో నాటిన ఆ పండ్లమొక్క
పచ్చని చెట్టుగ ఎదిగేను
కాయలు కాసేను కడుపులు నింపేను
పైనున్న వృద్దుడు పరవశించేను
తన పిల్లలు తన మనవళ్ళు
తన మునిమనవళ్ళు ఎన్నోపక్షులు
ఎన్నో జంతువులు పళ్లు ఆరగించేను
చల్లని ఆచెట్టు నీడన సేద తీర్చుకునేను
చెప్పండి ఆ వృద్దుడు చిరంజీవి కాదా
చిరస్మరణీయుడు కాదా...కారణం
కన్నుమూసినా కడుపు నింపుతున్న
ఆ వృద్ధుడి జన్మధన్యమే...
దక్కిఉండవచ్చు...
కోటిజన్మల పుణ్యఫలమే...
మరణించి ఆ
"వృద్దుడు వృక్షమై"
ప్రతి ఆకులో...
ప్రతి పండులో....
ప్రతి కొమ్మలో రెమ్మలో...
జీవించి ఉన్నట్లే...కాదనేదెవరు..?



