పచ్చని చెట్టేమంటుంది..?
చేతనైన సహాయం
చేయమంటుంది..!
తనలా పరోపకారిగా
బ్రతుకమంటుంది..!
తాను మండుటెండల్లో
మలమలమాడినా
తన చెంతకు చేరిన
బాటసారులకు
చల్లని నీడనిస్తుంది..!
తాను హోరుగాలికి
జోరువానకు
విలవిలలాడినా
కురిసే కుంభవర్షాలకు
తడిసి ముద్దైనా
తన నీడకు చేరిన వారికి
ఆకుల్తో గొడుగు పడుతుంది..!
తనను గొడ్డలితో
కసిగా నరికే వారికైనా
కమ్మని ఫలాలతో
కడుపు నింపుతుంది..!
అందుకే పాపాల
పుట్టగా మారిన ఈ
మనిషిగా పుట్టే కంటే
అడవుల్లో మానై
పుట్టుట మేలన్న
ఒక చేదునిజాన్ని
ఈ చెట్టంత మనిషి
తెలుసుకునేదెఎప్పుడో..!
తన జీవితాన్ని
మార్చుకునేదెప్పుడో..!
మరుజన్మంటూఉంటే
మానవత్వంలేని మనిషిగా కాక
పరోపకారియైన పచ్చని చెట్టుగా
పుట్టాలని ప్రతి మనిషి కోరుకోవాలి..!
ఆ చిరుకోర్కెను
తీర్చమని ఆ పరమాత్మను వేడుకోవాలి..!



