ఇతరులు నిన్ను
తెగ ఇష్టపడుతున్నారంటే...?
నీలో నీకు తెలియని
ఏదో గొప్ప కళ దాగివుందని
ఏదో నైపుణ్యం...సామర్థ్యం...
నీలో ఉన్నాయని గుర్తించు...!
ఇరుగు పొరుగు వారు నిన్ను
వేలెత్తి చూపుతున్నారంటే..?
నీపై విమర్శల బాణాలు
విసురు తున్నారంటే...?
విషం చిమ్ముతున్నారంటే..?
నిన్ను ద్వేషిస్తున్నారంటే..? అసహ్యించుకుంటున్నారంటే..?
నిందిస్తున్నారంటే..?
నీ వ్యక్తిత్వాన్ని
ప్రశ్నిస్తున్నారంటే..?
నీ మంచితనాన్ని
శంకిస్తున్నారంటే..?
నీలో నీకు తెలియని
నీకు అర్థం కాని
ఏదో పెద్ద లోపం...
నీతో పెద్ద సమస్య ఉన్నట్లే...
సందేహం లేదు...
ఓ మిత్రమా ఓ నా నేస్తమా
నీ పద్దతి మార్చుకో..!
నిన్ను నీవు సరిదిద్దుకో..!
నీ ఔన్నత్యాన్ని రక్షించుకో..!
నిన్ను నీవు తక్షణమే శిక్షించుకో..!
నీ గౌరవానికి గండీ పడింది కాపాడుకో..!
నీవు గడ్డిపరకవైపోకు గడ్డపారలా ఉండు.!



