తెలుగు భాషకు వెలుగు కిరణం...
పుట్టిన రోజు పండగే అందరికీ
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు
మహా పురుషులౌతారు
తరతరాలకు తరగని నిధులౌతారు
ఇలవేలుపులౌతారు
సాధన చేయుమురా నరుడా
సాధ్యం కానిది లేదురా
అలవాటైతే విషమేఐనా
హాయిగా త్రాగుట సాధ్యంరా
అంటూ సాహస వీరులెవ్వరో
విశ్వవిజేతలెవ్వరో, విజయానికి దారులెన్నో
వివరించారే నాడో మన "తెలుగు" సినీకవులు
ఒక చక్కని చెరగని చిరునామే
నభూతో న భవిష్యత్ అన్నట్టుగా నిర్వహించిన
ఘనుడు, త్యాగధనుడు, "సింహబలుడు"
సాహసకృత్యాలకు పెట్టింది పేరు
అసాధ్యాలను సుసాధ్యం చేసే "అఖండుడు"
భారీ బహిరంగ సభలను
నిర్విఘ్నంగా నిర్వహించే "బాహుబలి"



