ఓ కవుల్లారా !
నవకవుల్లారా ! రండి ! రండి !
సేవారత్న మూర్తి గారి ఆధ్వర్యంలో
ఇదిగో తెలుగు భారతి మీ కోసం
ఎదురు చూస్తున్నది ! మీకు
ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నది !
రండి ! రండి ! కలిసి రండి ! కదలి రండి !
ఓ కవుల్లారా !
కవిశేఖరుల్లారా ! రండి ! రండి !
మీ కలాలను హలాలుగా ధరించి
రైతన్నలై ! రండి ! రండి !
సాహితీ క్షేత్రాన్ని సాగుచేసేందుకు...
పచ్చని కవితలపంటలను పండించేందుకు...
రండి ! రండి ! కలిసి రండి ! కదలి రండి !
ఓ కవుల్లారా !
నవకవుల్లారా ! రండి ! రండి !
మీ కలాలను స్టెతస్కోపుల్లా
మెళ్ళో వేసుకుని డాక్టర్లై ! రండి ! రండి !
ఈ సంఘంలోని మూఢాచారాలను
దుష్ట దురాచారాలను రుగ్మతలను
మీ కవితలమందులతో రూపుమాపేందుకు...
అవసరమైతే ఆపరేషన్లు చేసేందుకు...
రండి ! రండి ! కలిసి రండి ! కదలి రండి !
ఓ కవుల్లారా !
కవికిషోరుల్లారా ! రండి ! రండి !
మీ కలాలను కత్తులుగా ఝలిపించండి !
సంఘంలో నేడు జరుగుతున్న
అన్యాయాల మీద.....
అక్రమాల మీద.....
ఆడపిల్లలపై జరిగే
అత్యాచారాల మీద.....
హత్యల మీద .....
యాసిడ్ దాడుల మీద .....
మీ నిరసనగళాన్ని వినిపించేందుకు...
రండి ! రండి ! కలిసి రండి ! కదలి రండి !
ఓ కవుల్లారా !
కవిబాంధవులారా ! రండి ! రండి !
కళ్ళుపొరలు కమ్మిన కామాంధుల
కుత్తుకలకు మీ కవితలే ఉరితాళ్లు కావాలి !
మన ఆడపడుచులంతా
ఆకాశంలో పక్షుల్లా స్వేచ్ఛగా విహరించాలి !
మన అక్కాచెల్లెళ్లందరు
అర్ధరాత్రిలో సైతం ఆకాశంలో నక్షత్రాల్లా
వెలుగుల్ని విరజిమ్మాలి ! అందుకే
రండి ! రండి ! కలిసి రండి ! కదలి రండి !
మన అమ్మలకు మన అక్కలకు
ప్రతిరూపాలైన ఈ స్త్రీజాతిఉద్దరణకు
మనవంతు కృషిని సహకారాన్ని అందించి
ఈ భరతమాత ఋణాన్ని తీర్చుకుందాం !
ఓ నవకవులారా ! రండి ! రండి !
తెలుగు భారతి పిలుస్తోంది !
రండి ! రండి! కలిసిరండి ! కదలిరండి !
మీకుస్వాగతం ! సుస్వాగతం ! ఘన స్వాగతం !
జై హింద్ ! జై తెలుగు తల్లి !!



