Facebook Twitter
ప్రకృతిని ప్రేమిస్తేనే...?

కష్టం...కష్టం...
అంటే నాకెంతో ఇష్టం
ఆ కష్టం రావడం నా అదృష్టం..?
నష్టం...నష్టం...
అంటే నాకెంతో ఇష్టం
ఆ నష్టం రావడం నా అదృష్టం..?

దుఃఖం...దుఃఖం...
అంటే నాకెంతో ఇష్టం నాకది
దూరంగా ఉండడం నా దురదృష్టం..?
కన్నీళ్లు...కన్నీళ్లు...
అంటే నాకెంతో ఇష్టం
అవి నిత్యం రాకపోవడం...
వచ్చి ఆగిపోవడం నా దురదృష్టం...?

ఇది రక్తం చూసి రాక్షసానందం పొందే
చింతల్లో చీకాకుల్లో చిరునవ్వులు నవ్వే
శాడిస్ట్ స్వభావం వాడి సిద్దాంతమని
అందరం పప్పులో కాలేస్తాం...నిజమే
చెడునెవరు కోరుకోరు...
మృత్యువు నెవరూ ఆహ్వానించరు...
కానీ ఒకరోజు నీకది ఆహ్వానించని అతిథే

అందుకే నిన్నువలె నీ పొరుగు వారిని
ప్రేమించమని బోధించిన
పవిత్ర గ్రంథం బైబిల్ ...
నీ ప్రాణమిత్రులనే కాదు
నీ బద్దశత్రువుల్ని సైతం ద్వేషించక
ప్రేమించమంటోంది...కారణం

చీకటిని ప్రేమిస్తేనే...నీకు
వెలుగు విలువ తెలిసేది...
ప్రకృతిని ప్రేమిస్తేనే...నీకు
పంచభూతాల విలువ తెలిసేది...

ఆకలిని ప్రేమిస్తేనే...నీకు
అమ్మచేతి వంటరుచి తెలిసేది...
ఆ వంట గదిలో అమ్మ చేసే
ఆ గొడ్డుచాకిరి నీర్థమయ్యేది...
ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి అమ్మ కార్చే
"చెమటచుక్కల విలువ" నీకు తెలిసేది