కలర్ కన్న క్యారెక్టర్ మిన్న..?
కలర్ ముఖ్యమే...కాదనలేం...
కానీ నింగిలో గర్వంగా
ఎగిరే ఆ త్రివర్ణ పతాకాన్ని...
పంచరంగుల ఆ రామచిలుకను...
ఏడురంగుల ఆ ఇంద్రధనుస్సును...
రవివర్మ వేసిన ఆ సప్త వర్ణచిత్రాన్ని...
బాపు గీచిన ఆ అందమైన బొమ్మను...
పురివిప్పి నాట్యమాడే ఆ మయూరిని...
తెలుగు వారి ఆడపడుచు ఎంకిని...ఆ
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వును...
పొడిచే మందారమంటి
ఎర్రని ఆ తొలి పొద్దును...
అమరశిల్పి జక్కన్న
చెక్కిన ఆ సుందర శిల్పాన్ని...
ఎన్నిసార్లు చూసినా ఎంతచూసినా
తీరదు...తీరదు...తనివి తీరదు...
వాటి అందం...రమణీయం... ...
కమనీయం...అనిర్వచనీయం...
వాటి సౌందర్యం....అధ్భుతం...
మహా అధ్భుతం...మనోహరం...
కానీ మనం ధరించే మన
దుస్తుల్లో "కలర్ కన్న కంఫర్ట్ "మిన్న...
మనం అలంకరించుకున్న మన
ముఖాల్లో "కలర్ కన్న క్యారెక్టర్ "మిన్న...



