నీవు ప్రకృతి ఆరాధికుడివైతే...?
ఓ నేస్తమా..!
నా అభయ హస్తమా..!!
నీవు స్నేహశీలి వైతే...?
నీవు ప్రేమమూర్తి వైతే...?
నీవు త్యాగధనుడి వైతే...?
నీవు ఒక శాంతి కపోతమైతే...?
నీవు సహనానికి యజమానివైతే...?
సప్తలోకాలు నీకు
సలాం చేస్తాయి
గులాం లౌతాయి...
ఆకాశంలో నక్షత్రాలు
నీ కంటికి వెలుగౌతాయి...
నీ ఇంటిలో దీపాలౌతాయి...
పంచభూతాలు నీకు
ఆత్మబంధువులౌతాయి...
సూర్య చంద్రులు
నీకు చుట్టాలౌతారు...
నింగిలోని మేఘాలు
నీ ఆశలకు ఆశ్రయమిస్తాయి...
ఆకాశాన ఎగిరే పక్షులు
నీ ఆశయాలను ఆలపిస్తాయి...
అడవిలో తిరిగే జంతువులు....
నీకు జయజయధ్వానాలు చేస్తాయి...
నీవు ప్రకృతి ఆరాధికుడవైతే...?



