నిన్న విశ్వాసానికి
మారుపేరైన శునకాలు
నేడు విషసర్పాలై
వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి..!
దారి కాచి హఠాత్తుగా
దాడి చేస్తున్నాయి....!
ఏంరోగమొచ్చిందో ఏమో
ఈ వీధికుక్కలకు... …
ఈ గజ్జి కుక్కలకు...
ఈ పిచ్చికుక్కలకు...
నిర్దాక్షిణ్యంగా మీద పడి
రక్తం చిందేలా రక్కుతున్నాయి..!
పిల్లలను పీక్కుతింటున్నాయి...!
గతంలో అరిచేవి మొరిగేవి కానీ
ఇప్పుడు కసిగా కరుస్తున్నాయి...
దారుణంగా దాడి చేస్తున్నాయి...
క్షణాల్లో ప్రాణాలను తీస్తున్నాయి...
కారణం ఒక్కటేనట...
ఆదరణ లేకపోవడమట...!
ఆహారం దొరకపోవడమట..!
అది నిజం కాకపోవచ్చునట...!
వైద్యుల ఊహలకు అంచనాలకు
శాస్త్రవేత్తల పరిశోధనలకు అందని
వ్యాధి ఏదో సోకి ఉండవచ్చునట..!
ఓ పిల్లలారా..! ఓ పెద్దలారా..!
ఓ వృద్ధులారా..! జరా జాగ్రత్త..!
అప్రమత్తంగా ఉండండి..!
ఆయుధాలతో బయటికెళ్లండి..!
ఓ జంతు ప్రమికులారా..!
ఈ కుక్కల దాడిని
అరికట్టే మార్గాలను ఆలోచించండి..!
ఓ ప్రభుత్వ అధికారులారా..!
తక్షణమే వీధి కుక్కలదాడికి
బలైపోతున్న బడిపిల్లలను రక్షించండి..!



