వద్దు వద్దు..! ముద్దు ముద్దు.!!
ఒకరిపై ఒకరికి
"గుడ్డి నమ్మకం" వద్దు..!
"గట్టి నమ్మకమే ముద్దు"..!
అపార్థం చేసుకునే
"చెడు మనసు" వద్దు..!
"అర్థం చేసుకునే
"మంచి మనసే ముద్దు"..!
ఎదుటి వారి
అభిరుచులను
అభిప్రాయాలను
"తూలనాడే తృణీకరించే
"క్రూర మనస్తత్వం" వద్దు..!
అందరి ఆలోచనలను
భావాలను "స్వీకరించి గౌరవించే
"స్వచ్చమైన వ్యక్తిత్వమే ముద్దు"..!
చిన్నది తప్పు చేస్తే
పెద్ద శిక్ష వేసి మానసికంగా
"హింసించే రాక్షసగుణం" వద్దు..!
పెద్ద తప్పు చేసినా
చిరునవ్వుతో "క్షమించే
"కరుణార్ద్ర హృదయమే" ముద్ధు.!
నిప్పు మీద
పడ్డ ఉప్పులా
చీటికి మాటికి
చిటపటలాడవద్దు..!
చిరుబురులాడవద్దు..!
"చీదరింపులు" వద్దు...!
ప్రేమతో...చిరునవ్వుతో
కూడిన "పలకరింపులే" ముద్దు..!
ఇవే కదా నిజజీవితంలో
బంధాలను నిలబెట్టే దీపస్తంభాలు..!



