Facebook Twitter
ఒకసారి...మోసపోతే..?

ఒకసారి... మోసపోతే
అది నీ అమాయకత్వం..!
రెండోసారి...మోసపోతే
అది నీ అవివేకం అజ్ఞానం..!

మూడోసారి...మోసపోతే
అది నీ మూర్ఖత్వం..!
నాలుగోసారి...మోసపోతే
అది నీ వెర్రితనం..!

ఐదోసారి...మోసపోతే
అది నీ పిచ్చితనం..!
ఆరోసారి... మోసపోతే
అది నీ చేతగానితనం..!

ఏడోసారి...మోసపోతే
అది నీ పిరికితనం..!
ఎనిమిదవసారి...మోసపోతే
అది నీ అతి నమ్మకం...!

తొమ్మిదవ సారి...మోసపోతే
అది నీ అతి మంచితనం..!
పదవసారి...మోసపోతే
అది గడ్డితినే నీ గుడ్డితనం..!

ఇంకెన్ని సార్లు మోసపోతావ్..?
వాళ్ళు మోసగాళ్ళకే మోసగాళ్ళు...
నీవా మోసగాళ్ళ చేతుల్లో కీలుబొమ్మవు.
ఆశపడ్డావో ఉరివేస్తారు ఊపిరి తీస్తారు

జరా జాగ్రత్త సుమీ...
చేతులు కాలాక ఆకులు పట్టుకొని
మోసపోయాక కుమిలిపోయి లాభమేమి?
ముందేఉండాలిగా కాసింత ముందుజాగ్రత్త