నరుడా..! ఓ నరుడా..!!
జీవితంలో తగిలిన
చిన్న ఎదురు దెబ్బకే
దిమ్మతిరిగి మైండ్
బ్లాకయ్యిందా..?
ఎందుకలా
కృంగిపోతున్నావ్..?
ఎంతకాలమిలా
కుమిలిపోతావ్..?
ఎప్పుడు తెలుసు కుంటావ్..?
సంపూర్ణ జీవిత సత్యాన్ని..?
జీవితమంటే..?
పడిపోయినా...
తిరిగి కడలి అలలా
ఎగిసి పడడమని...
జీవితమంటే..?
మోడువారినా...
తిరిగి చెట్టుకొమ్మలా
చిగురించడమని...
నరుడా..! ఓ నరుడా..!!
ఒక్క చెంప దెబ్బకే
అంతా అయిపోయిందని
"అక్కడే...ఆగిపోతావో "...
ఇంకా చాల మిగిలి ఉందని
బంగారు భవిష్యత్తుఉందని
కొండంత ఆశతో
"సాహసంతో...ముందుకు
"సాగిపోతావో "...తేల్చుకో...
ఒక్కటిగా కాదు
కొన్ని వేల ఉలిదెబ్బలు
తగిలి తగిలి
సుందర దేవతా శిల్పంగా
మారిన శిలతో
నీ జీవితాన్ని...పోల్చుకో...
నీకే జ్ఞానోదయమౌతుంది
జీవితమంటే...?
శిల కాదు శిల్పమని...
జీవితమంటే...?
కల కాదు వాస్తవమని...
జీవితమంటే...?
ఓటమి కాదు గెలుపని...
జీవితమంటే...?
చీకటి కాదు వెలుగని...
జీవితమంటే...?
కన్నీటి వరద కాదు
చిరునవ్వుల చిరుజల్లని...
జీవితమంటే...
క్రింద పడి ఉండడం కాదు...
పడినా పైకి లేచి...పరుగెత్తడమని



