ఓ మనిషీ...ఒక్కసారి
బలంగా..."విశ్వసించు"..!
కనిపించని ఆ భగవంతున్ని
కన్నీటితో "ప్రార్థించే" ముందు..!
ఓ మనిషీ...ఒక్కసారి
శ్రద్దతో ఓపికతో..."విను"..! ఏదైనా
ఒక మాట "మాట్లాడే" ముందు..!
ఓ మనిషీ...ఒక్కసారి
కష్టపడి చెమటోడ్చి
ఆస్తులు..."ఆర్జించు"..!
పరుల మెప్పు కోసం
భారీగా "ఖర్చు చేసే" ముందు..!
ఓ మనిషీ...ఒక్కసారి
లోతుగా అధ్యయనం చేసి...
దీర్ఘంగా సుదీర్ఘంగా..."ఆలోచించు"..!
గొప్ప కావ్యాన్ని"లిఖించే" ముందు..!
ఓ మనిషీ...ఒక్కసారి
గట్టిగా..."ప్రయత్నించు"..!
నిన్న తలపెట్టిన
ఒక శుభకార్యం నుండి
నేడు అర్థాంతరంగా
"విరమించుకునే" ముందు..!
ఓ మనిషీ...ఒక్కసారి
తృప్తిగా...
హాయిగా...
ఆనందంగా
ప్రశాంతంగా...
సంపూర్ణంగా..."జీవించు"..!
ఆ పరమాత్మను భక్తితో ధ్యానించు..!
తప్పించుకోలేని చావు వచ్చి
తలుపులు తట్టే ముందు..!
"కన్నుమూసి కాటికెళ్ళే" ముందు..!



