నీ సెల్లు జాగ్రత్త..! నీ కళ్ళు జాగ్రత్త..!
నీ సెల్లు
నీ మెడకు
చుట్టుకున్న
ఒక విషసర్పం
ఖచ్చితంగా
కనపడకుండా అది
నిన్ను కాటు వేస్తుంది
నీ కళ్ళు జాగ్రత్త
నీ ఒళ్ళు జాగ్రత్త
వీలైనన్ని ఎక్కువ
సార్లు నీళ్ళు త్రాగు
తగినంతగా నిద్రపో
ఉదయం పూట
కొంచెం దూరమైనా
నడవడానికి
ప్రయత్నంచు
బద్దకించకు
తిను...తిరుగు
తిరిగి...తిను
నీవు సోమరివని
పరమ బద్దకస్తుడవని
నీపై ముద్రపడనియ్యకు
అది చెరపలేని ఒక మచ్చ
నీవు చిన్న పిల్లవాడివి కాదు
కొట్టడానికి తిట్టడానికి
ఎవరూ ఏమీ అనలేక
నీ ఖర్మకు నిన్ను వదిలేస్తారు
తర్వాత వచ్చే ప్రతి సమస్యకు
200% బాధ్యుడవు నీవే...
ఆపై మిగిలేది పచ్చాతాపమే...
తగిలేది కోలుకోలేని దెబ్బలే...
అది పంచుకోలేని...ఎవరికీ
చెప్పుకోలేని దిక్కులేని దీనస్థితి...
అది రాకుండా ఉండాలంటే...
బద్దకపు సంకెళ్ళను తెంచుకోవాలి
సోమరితనానికి నీవు స్వస్తి పలకాలి



