అతిచనువు బలహీనత
ఏకాంత కలయికలే మొలకెత్తే
అక్రమసంబంధాలకు వానచినుకులు
ఆపై రెండు కుటుంబాల
పరువు ప్రతిష్టలు గంగపాలు
పచ్చని కాపురంలో కారుచిచ్చు...
పుట్టిన బిడ్డల బ్రతుకు ప్రశ్నార్థకం...
ఆరని నిప్పులకుంపటే ఆ కుటుంబం...
భారతీయ సంస్కృతి
సంప్రదాయాలతో జరిగే
పెళ్లంటే నూరేళ్ళ పంట...
అది ఒక పవిత్ర కార్యం...
పడకగది ఎప్పుడు
ఇద్దరికే పరిమితం కావాలి...
మూడోవ్యక్తితో ఎప్పుడూ ముప్పే...
అక్రమసంబంధం ఒక ఊబి...
అక్రమసంబంధం ఒక అగ్ని జ్వాల...
అక్రమసంబంధం ఒక అగ్ని గుండం...
అక్రమసంబంధం ఒక అగ్ని పర్వతం...
పచ్చని కాపురంలోకి
మూడో వ్యక్తి చొరబడితే
ఆడైనా మగైనా పడకగదిలోకి
"విషనాగు "చొరపడినట్టే...ఆ ఇంట్లో
ఇక చిరునవ్వులుండవు చిటపటలే...
అనురాగం ఆప్యాయతలుండవు
అనుమానాలు అపార్ధాలే...
వినోదముండదు
విషం చిమ్ముకోవడాలే...
నిన్నటి వరకు తమ ప్రేమ
స్వచ్చమైన ఒక పాలకుండ...
రాలితే అందులో ఒక విషపుచుక్క
నిన్నటి వరకు దేవుళ్ళు దేవతలు
నేడు వాళ్ళే పిచ్చివాళ్ళు పిశాచులు
కత్తులు నూరుకుంటారు
కసికసిగా చూసుకుంటారు
మాటల యుద్దం ప్రారంభం...
అర్థరాత్రిలో అరుపులు కేకలు
కొట్టుకోవడాలు తిట్టుకోవాడాలు
పోలీస్ కేసులు పెట్టుకోవాడాలు...
పోలీస్ స్టేషన్ల చుట్టు కోర్టుల చుట్టూ తిరగడాలు...విధిలేక విడాకులు...ఆపై
కారుమబ్బులు కమ్మిన
ఒంటరి జీవితాలు...
ఎడారిలో ఒంటెల్లా...
రెక్కలు విరిగిన పక్షుల్లా...
దారం తెగిన గాలిపటాల్లా...
గుండెలో గాయాలను క్షణం క్షణం ప్రతిదినం గుర్తుచేసుకుంటూ కుమిలి
కుమిలిపోతూ జీవశ్చవాల్లా బ్రతకడం..!
భార్యాభర్తలూ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త..!
అక్రమసంబంధం ఒక ఆరని అగ్నికణం..!



