ఎక్కడుంది..? ఎక్కడుంది..?
నీ ఆరోగ్యమెక్కడుంది..?
నీ బుర్రలో...
నీ బుద్ధిలో...
నీ నవ్వులో...
నీ నడకలో...
మలినము లేని
నీ మనసులో...
స్వచ్ఛమైన
నీ తలపుల్లో...
నీవు చేసే
యోగాలో...
ధ్యానంలో...
వ్యాయామంలో...
నీ విజ్ఞానంలో...నీ విచక్షణలో ఉంది..!
నీ అనారోగ్యమెక్కడుంది..?
నీ కోపంలో...
నీ ఒత్తిడిలో...
నీ బద్దకంలో...
నీ ఉద్వేగంలో...
నీ ఉక్రోషంలో...
నీ ఆందోళనలో...
నీ బలహీనతలో...
నీ ఓర్వలేనితనంలో...
నీ పగ ప్రతీకారాలలో...
నీ అసూయ ద్వేషాలలో...
నీ అంతరంగంలోని అరిషడ్వర్గాలలో...
నీ అజ్ఞానంలో...నీ అహంకారంలో ఉంది..!



