ఆ వృద్దులకు దిక్కెవరు..?
అపరిచితులిద్దరు
ఒకరికొకరు
మాటలు కలిస్తే
పరిచయమై
స్నేహితులౌతారు
ఆ స్నేహం
పరిమళ భరితమైతే
ప్రేమికులౌతారు
ఆ ప్రేమ ఆ భగవంతుని
ఆమోదం పొందితే
వధూవరులౌతారు...
ఆపై భార్యా భర్తలౌతారు
ఆపై తల్లీదండ్రులౌవుతారు
ఆపై అవ్వా తాతలౌతారు
కాలం కలిసి రాక
కడుపున బిడ్డలే కసాయి వారైతే
వీధిలోకి విస్తరాకులల్లా విసిరేభస
ఆపై ఆ వృద్దదంపతులకు దిక్కెవరు..?
మొదట రక్తం పంచారు ఆపై
స్వచ్చమైన ప్రేమను పంచారు
ఆపై ఆర్జించిన ఆస్తుల్ని పంచారు
ఐనా ఏది కృతజ్ఞత...
అంతా మాయ
ఏమాయ బంధాలు
రక్త సంబంధాలు...
అందుకే ఇంటికి వాడని
కిటికీలు పెట్టీ ప్రయోజనం లేదు...
కన్న తల్లీదండ్రులకు
ఇంత ముద్ద పెట్టలేని...
ఇంత ప్రేమను పంచలేని...
కాసింతైనా కనికరం...
దయ...జాలి...చూపని...
కసాయి కొడుకులు...
కూతుళ్ళు పుట్టీ ప్రయోజనం లేదు...



