ఆ పరమాత్మ నీకు...
నచ్చిన గోమాతనిచ్చాడు
పచ్చగడ్డినిచ్చాడు
పాలకుండనిచ్చాడు
ఇక పాలు
పితకవలసింది
ఆ పరమశివునికి
పాలాభిషేకం
చేయవలసింది నీవే
అసలై సుత్రధారి...
ఆ పరమాత్మయే...
నీవు కేవలం...
ఒక పాత్రధారివే...
మార్కెట్ కెళ్ళి
సరుకులు తెచ్చేది
నాన్నే...కాదనలేం...
వంట చేసి వడ్డించేది
కమ్మని రుచులతో కడుపు
నింపేది అమ్మే...కాదనలేం...
కానీ కనిపించని సూత్రధారి...నాన్న
కనిపించే ఒక పాత్రధారిణి.....అమ్మ
పెళ్లితంతు ముగిశాక
నూతన వధూవరులిద్ధరిని
శోభనం గదిలో బంధించేది
అమ్మానాన్నలే కానీ వారిద్దరిని
అవ్వాతాతల్ని చేయాల్సింది...
కలిసి బిడ్డను కనాల్సింది వీరిద్దరే...
అసలై సూత్రధారులు...ఆలూమగలే...
అమ్మానాన్నలు కేవలం పాత్రధారులే...
నిన్ను కాలేజీలో చేర్పించాక...
నీకు ఫీజులు చెల్లించే మీ నాన్న
నీకు పాఠాలు బోధించడు...
నీకు పాఠాలు బోధించే
నీ గురువులు...నీ పరీక్షలు వ్రాయరు
నీకు ఉద్యోగాలివ్వరు...ఆ ఇద్దరూ
నిన్ను ఉద్యోగానికి అర్హున్ని చేస్తారు
పాఠాలు చదవవలసింది నీవే...
పరీక్షలు వ్రాయవలసింది నీవే...
ఇంటర్వ్యూ లకెళ్ళాల్సింది నీవే...
ఉద్యోగాన్ని ఆర్జించవలసింది నీవే...
అసలైన సూత్రధారులు...వారే...
నీవు కేవలం...ఒక పాత్రధారివే...
నీకు జబ్బు చేసిందంటే...
అది తగ్గాలంటే...
"డాక్టర్ని" సంప్రదించాల్సిందే...
నీవు స్వస్థత పొందాలంటే...
"ఔషధాలు" వాడవలసిందే..నీ
మొండివ్యాధి నయం కావాలంటే
"శస్త్రచికిత్స" చేయవలసిందే...
కానీ ఆస్పత్రిబిల్లు
చెల్లించాల్సింది మాత్రం నీవే...
అసలైన సూత్రధారులు...ఆ డాక్టర్లే...
నీవు కేవలం...ఒక పాత్రధారివే...



