Facebook Twitter
ఓ మిత్రమా..! మీకు శుభోదయం..!!

ఓ మిత్రమా..! నీకు
శుభోదయం ఎందుకంటే..?

అందరూ బాగుండాలని...
అందరి సంక్షేమాన్ని
ఆశించే...ఆకాంక్షించే...

తేనె చుక్కలాంటి...
మల్లె మొక్కలాంటి...
గందపు చెక్కలాంటి...
మంచు ముక్కలాంటి...

ఒక్క కన్నీటి
చుక్కకే కరిగిపోయే...
ఒక చిన్న బాధకే కదిలిపోయే...
పసివాని మనసున్న‌ నిన్ను...

గుడిలో గణగణమని
గంటలు మ్రోగే వళ...
కొమ్మల్లో కోయిలమ్మలు
కమ్మని కూనిరాగాలు తీసే వేళ

ఆ దైవం చేయి పట్టి
భుజం తట్టి నిద్రలేపాలని...
నీవు కళ్ళు తెరచి
ఈ ప్రపంచాన్ని వీక్షించాలని...
లేలేత రవికిరణాలు
నిన్ను ముద్దాడాలని...
నీచుట్టూ వెలుగుల్ని నింపాలని...

అన్ని ఆయుధాలు నీకు అందించాలని...
నీ అభయహస్తం అందరినీ ఆదుకునేలా
సంపూర్ణ ఆరోగ్యం నీకు ప్రసాదించాలని...
నీఆప్తమిత్రుని...ఆశ...ఆకాంక్ష.
..