Facebook Twitter
శత్రువును ప్రేమించు..! స్నేహదీపం...వెలిగించు..!!

పవిత్ర గ్రంథం
బైబిల్ సందేశం ఒక్కటే..!
"నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ
నీ బద్ధశత్రువులను సైతం ప్రేమించమని"..!

ఎప్పుడైనా ఏక్కడైనా
అకస్మాత్తుగా ఎదురు పడితే..!
"చిరునవ్వుతో..."పలకరిస్తే"...
నీ మిత్రుడైతే..పులకరించిపోతాడు
నీ శత్రువైతే....పరమానందభరితుడౌతాడు

ఎప్పుడైనా ఏక్కడైనా
అకస్మాత్తుగా ఎదురు పడితే..!
అభిమానంతో..."కరచాలనం చేస్తే"...
నీ మిత్రుడైతే...ఆనందపడతాడు
నీ శత్రువైతే.....ఆశ్చర్య చకితుడౌతాడు

ఎప్పుడైనా ఏక్కడైనా
అకస్మాత్తుగా ఎదురు పడితే..!
"చేతులు జోడించి నమస్కరిస్తే"...
నీ మిత్రుడైతే...పరవశించిపోతాడు
నీ శత్రువైతే.....సంబరపడి పోతాడు

ఎప్పుడైనా ఏక్కడైనా
అకస్మాత్తుగా ఎదురు పడితే..!
ఆత్మీయంగా"ఆలింగనం" చేసుకుంటే
నీ మిత్రుడైతే....చిరునవ్వునవ్వుతాడు
నీ శత్రువైతే......నమ్మలేక పోతాడు

ఎప్పుడైనా ఏదైనా
కార్యక్రమంలో కలిస్తే...
"మెళ్ళో పూలమాల వేస్తే"...
"ఒంగి పాదాలకు నమస్కరిస్తే"...
నీ మిత్రుడైతే...చలించిపోతాడు..!
నీ శత్రువైతే.....నిశ్చేష్టుడైపోతాడు..!

అప్పుడు...ఇద్దరిమధ్య
శత్రృత్వం తొలిగినందుకు....
స్నేహ దీపం వెలిగినందుకు..

ఆనందబాష్పాలే...కళ్ళనిండా
పశ్చాత్తాపమే...గుండెల నిండా
అంతులేని కృతజ్ఞతే...మదినిండా
పరమాత్మ స్మరణే...తలపులనిండా