ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
ఈ జీవితం ఎంతో విలువైనది..!
ఉన్నతమైనది..! ఉత్కృష్టమైనది..!
మహోన్నతమైనది..! మహిమగలది..!
మళ్ళీమళ్ళీ రానిది ఈ మానవ జన్మ..!
కానీ ఈ జీవితం చాలా చిన్నది..!
ఇందులో ఓ సత్యం దాగున్నది..!
ఓ మిత్రమా..! నీకేం పని..?
నిన్ను ద్వేషించే వారితో...
నిన్ను నిత్యం విమర్షించక
నిదురపోని వారితో...
నీవంటే ఇష్టం లేనివారితో...
నీపై నిందలు మోపేవారితో..!
ఓ మిత్రమా..! నీకేం పని..?
నిన్ను నలుగురిలో
నవ్వులపాలు చేసేవారితో...
నిన్ను అర్థం చేసుకోనివారితో...
నీకు దూరంగా పారిపోయేవారితో...
నిన్ను బద్దశత్రువుగా భావించేవారితో..!
అందుకే ఓ మిత్రమా..!
నీ ఈ చిన్ని జీవితం
చిరునవ్వులతో గడుపు...!
చింతలేల...? చీకాకులేల..?
నిన్ను ప్రేమించే వారితో గడుపు..!
నిన్ను నవ్వించే వారితో గడుపు..!
నిన్ను గౌరవించే వారితో గడుపు..!
ఆ పరమాత్మ సన్నిధిలో గడుపు..!



