Facebook Twitter
ఎవరికన్నా ఎవరు మిన్న..?

రక్తం పంచిన...మా నాన్న కన్నా..!
రక్తం పంచి...
పాలిచ్చి పెంచే...మా అమ్మే మిన్న..!!

గోల చేస్తే తిట్టే...మా నాన్న కన్నా..!
గోరు ముద్దలు పెట్టే...మా అమ్మే మిన్న..!!

అందమైన ఆట బొమ్మలు
కొనిచ్చే...మా నాన్న కన్నా..!
చక్కని జోల పాటలు పాడి
నిద్ర పుచ్చే...మా అమ్మే మిన్న..!!

మాతో ఆటలాడే...మా నాన్న కన్నా..!
ఆటలాడి అలిసిపోయాక
ఆకలి తీర్చే...మా అమ్మే మిన్న..!!

జబ్బు చేస్తే...
డబ్బులిచ్చే...మా నాన్న కన్నా..!
డాక్టర్ దగ్గరకు...
పరుగులు తీసే...మా అమ్మే మిన్న..!!

స్కూల్లో స్కూటర్లో
దింపే...మా నాన్న కన్నా..!
హోంవర్క్ చేసి పెట్టే...మా అమ్మే మిన్న..!!

కరుణ లేని...మా నాన్న కన్నా..!
కన్నీరు కార్చే...మా అమ్మే మిన్న..!!

కని పారేసిన...మా నాన్న కన్నా..!
కని,పెంచే...మా కన్నతల్లే మిన్న..!!

కసాయియైన...మా నాన్న కన్నా..!
కరుణామయిఐన‌...మా అమ్మే మిన్న..!!

నాన్నా..! ఓ నాన్నా..!
త్రాగుడుకు బానిసవయ్యావన్న
బాధలో ఉన్నా
నన్ను తిట్టకే కొట్టకే ఊరికే అన్నా..!

మాకు జన్మనిచ్చిన మీరిద్దరూ
మాకు కనిపించే "రెండు కళ్ళు"..!
కనిపించని "ఒక గుండె"..‌!
మేమే మీకు పంచ ప్రాణాలు..!
మీరే మాకు ప్రత్యక్ష దైవాలు..!!