Facebook Twitter
ప్రియా..! ఓ నా ప్రియా..! నీవక్కడ నేనిక్కడ మన ప్రేమ ఎక్కడ..?

మొన్న పరిచయమై
కళ్ళు రెండు కలిసిపోయే..!
నిన్న రెండు మనసులు ఏకమాయే..!
నేడు రెండు కుటుంబాలు ఒకటాయె..!
నిశ్చితార్థం జరిగి పెళ్లి ఖాయమాయె..!

ప్రియా..! ఓ నా ప్రియా..!!
నీవక్కడ నేనిక్కడ మన ప్రేమ ఎక్కడ..?

ప్రియతమా..! ఓ ప్రియతమా..!
నిరీక్షించే నీ కళ్ళలో....!
నిదురరాని నా కళ్ళలో మన ప్రేమక్కడ..!

నేడు పెళ్ళిజరిగి శోభనం మిగిలిపోయే
రాత్రంతా పిచ్చి కోరికలతో రగిలిపోయె
నాతనువంతా నీకోసం తహతహలాడే
తరగని తపనతో అది తగలబడిపోయే

ప్రియా..! ఓ ప్రియా..!!
నీవక్కడ నేనిక్కడ మన ప్రేమ ఎక్కడ..?

ప్రియతమా..! ఓ ప్రియతమా..!
నా గుండె గుడిలో దీపమై
వెలుగుతూ నీ ప్రేమిక్కడ..!
నీ మదిలో ప్రాణనదియై
ప్రవహిస్తూ నా ప్రేమక్కడ..!

ప్రియా..! ఓ ప్రియా..!
నీవక్కడ నేనిక్కడ...మన ప్రేమ ఎక్కడ..?

ప్రియతమా..! ఓ నా ప్రియతమా..!
ఆ శోభనం గదిలో...
ఆ స్వర్గసీమలో...
ఆ రంగుల లోకంలో......
విహంగమై...విహరిస్తూ మన ప్రేమక్కడ

ఆపై గోవాలో...
హనీమూన్ లో...
ఫైవ్ స్టార్ హోటల్లో‌.‌..
విలాసవంతమైన ఓ గదిలో
విరిసిన గులాబీ పువ్వువై నీవు
నీ ముద్దులవర్షంలో తడిసి నేను
ఆనందిద్దాం ఇద్దరం అమరప్రేమికులమై...
అందాకా అగవయ్యా నా బంగారం..!
తప్పదా నా చిరునవ్వుల సింగారం..!