తినేటప్పుడు...
వీధిచివర బిక్షగాళ్ళ
ఆకలి కేకల్ని
చెత్తకుండీల దగ్గర
విసిరేసిన విస్తరాకుల్లో
ఎంగిలి మెతుకులు
ఏరుకుంటూ
ఆకలికి అలమటించే
అనాధ బాలలను
గుర్తుచేసుకుంటూ తినాలని...
మా "తాతయ్య" చెప్పా...!
వినేటప్పుడు...
వినయంతో వినాలని...
మా "అమ్మ" చెప్పా...
మాట్లాడేటప్పుడు...
మర్యాదతో మాట్లాడాలని...
మా "నాన్న" చెప్పా...
సమాధానం చెప్పేటప్పుడు...
సంస్కారంతో చెప్పాలని...
మా "గురువుగారు" చెప్పా...
2...
ప్రార్థించేటప్పుడు...
ముందుగానే పొందుకున్నట్టు
ఆవగింజంత అనుమానం లేక
భక్తితో కన్నీటితో ప్రార్థించాలని...
మా "ఊరి పూజారి" చెప్పా...
ఆటాడేటప్పుడు...
ఒక్క క్షణం కూడా
ఓటమిని తలంచరాదని...
కళ్ళకెప్పుడు కప్పే
కనిపించాలని...
మదిలో లక్ష్యాన్ని
ముద్రించుకోవాలని...
రాత్రి నిద్రించేవేళ
విజయాన్నే కలగనాలని
నా "ప్రియ నేస్తం" చెప్పా...
చూసేటప్పుడు...
కళ్ళల్లో ఏ కల్మషం లేకుండా
మదిలో ఏ మలినం లేకుండా
స్వచ్చంగా చూడాలని...
నా "శ్రేయోభిలాషి" చెప్పా ...!
3...
పోట్లాడేటప్పుడు...
ఓపిక ఉన్నంతవరకు కాదు
బొందిలో ఊపిరి ఉన్నంతవరకు
ప్రాణాలకు తెగించి పోరాడాలని...
"యుద్ధనౌక గద్దరన్న" చెప్పా...
ప్రశ్నించేటప్పుడు...
ఉద్యమకారుల...
గొంతు నొక్కేస్తారని...
ప్రాణాలకు ముప్పని...
ఐనా ప్రతిఘటించాలని...
విప్లవశంఖం పూరించాలని...
రక్తతర్పణకు సిద్దం కావాలని...
"విప్లవసింహం అల్లూరి" చెప్పా...
ప్రేమించేటప్పుడు...
విధి విషం చిమ్మి
ప్రేమ విఫలమైతే
నిందలు భరించడానికి
బాధను దిగమింగడానికి
విషాదాన్ని తట్టుకోవడానికి
అవమానాలను సహించడానికి
ప్రేమకోసం ప్రాణాలర్పించడానికి
ముందుగానే సిద్ధం కావాలని...పరువు
హత్యకు బలైన "అమర ప్రేమికులు" "అమృత ప్రణయ్ లు" చెప్పా...
ప్రాణాలర్పించేటప్పుడు...
దేశం కోసమైతే...
ఒక విప్లవీరునిగా...
కన్నతల్లి భరతమాత సేవలో
తన జన్మ తరించిపోయెనని...
తలంచి తనువు చాలించాలని...
"మేజర్ కల్నల్ సంతోష్" చెప్పా...
ఈ జీవిత పాఠాలు...
చీకటిలో చిరుదివ్వెలు...
నా విజయానికి సోపానాలు...
నా జీవితానికి దారి దీపాలు...



