ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
ఒక్కసారి ఆలోచించు
నీ దగ్గరికి ఎందరో
సహాయం కోసం
సలహాల కోసం
అప్పు కోసం
అవసరం కోసం
ఆపదలో ఉన్నామని
ఆర్థిక సహాయం కోసం రావొచ్చు
వారు నీ సహాయం పొందిన
తర్వాత కృతజ్ఞతతో ఉన్నారా..?
అభిమానంతో ఆరాధిస్తున్నారా..?
నీకున్న గౌరవం తగ్గిందా పెరిగిందా..?
నిన్ను అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారా..?
సహాయం చేసినప్పుడు
నిన్ను దేవుడని ఆ తర్వాత
దెయ్యమని అంటున్నారా..?
నీ మాట వింటున్నారా..?
నిన్ను ప్రేమిస్తున్నారా..?
నిన్ను దైవంలా భావిస్తున్నారా..?
బ్రతకాలని ప్రార్థిస్తూ
మరణించేందుకు
మందులిచ్చినట్టు
పూజిస్తున్నారా
నీ వెనుక హేళనగా
ఎగతాళిగా వ్యంగంగా
మాట్లాడుతున్నారా..?
వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారా..?
నీ వెనుక లోతులు గోతులు తవ్వుతున్నారా..?
మీపై నిందలు వేస్తున్నారా..?
ఒక్కసారి గమనించాలి
సిసి కెమెరా
కళ్ళతో నిఘా పెట్టాలి
గుడిలో దైవం సైతం
గుడ్డిగా ఎవరికీ వరాలివ్వడు
భక్తుల ప్రార్థనలు ఇష్టపడితేనే
వారికి వరాల వర్షం
పాపాలు ఎక్కువైతే శాపాలే...
ఇది కదా పరమాత్మ
దుష్టశిక్షణ శిష్టరక్షణ అంటే...
బద్ధకస్తులను
పిరికిపందలను
తిరుగుబోతులను
ఏ పని చేయకుండా
నిత్యం నిద్రమత్తులో
జోగే సోమరిపోతులను
భగవంతుడు సైతం ప్రోత్సహించడు



