1...
ఎవరమ్మా వాడు..? వాడా...
వాడే నేటి నా ప్రియుడు
రేపు నా కొంగున వ్రేలాడే
నా ముద్దుల మొగుడు
వాడు వెంటబడితే నా కంట బడితే
వాడు చిలిపిగా చిరునవ్వు నవ్వితే
వాడు కన్ను గీటితే రా...రమ్మని సైగచేస్తే
వాడి ప్రక్కన ఒక్కసారి
కూర్చున్నా నిలుచున్నా
ఒక్కరాత్రి వాడి బిగికౌగిలిలో
కరిగిపోతే..నా జన్మ ధన్యమే
అది వేయిజన్మల పుణ్యఫలమే...
వాడి చేయి స్పర్శ తగిలితే...
ఏదలో ఏదో కొత్త కోరిక రగిలితే...
వాడి పెదవులు
నా పెదవులు పంటికింద నలిగితే...
వాడు చూపులు మరల్చక
కన్నార్పక కొరుక్కుతినేలా
మదిలో మన్మథ బాణాలు
విసిరినట్టుగా...కసికసిగా
పొగరుగా చిలిపిగా చూస్తే...
2...
సెగలు పొగలు
గ్రక్కే వాడి ఊపిరి
నా ఒంటికి తగిలితే...
నా కంటికి మత్తే మైకమే...
నా ఒంటికి పూనకమే...
ఊపిరాడకనేను క్షణం సేపు
ఉక్కిరిబిక్కిరే...ఎందుకంటారు?
దీన్నేమంటారు పిచ్చంటారా..? అనండీ...
నాకు ఆకలుండదు...దాహముండదు
వాడు తలపుకొస్తే...వలపుతలుపు తీస్తే
గాలిలో తేలిపోతుంటా వాన్ని చూస్తుంటే...
దీన్నేమంటారు..? వెర్రంటారా..? అనండీ...
కానీ నన్ను శపించకండి...
నన్ను క్షమించండి...కారణం
నాలో నేను లేను నా ఆత్మ నాలో లేదు నేనిప్పుడు వాడి చేతిలో కీలుబొమ్మనే
వాన్నేమి అనకండి వాడు నాబంగారం
నన్ను తిట్టండీ...కొట్టండి...నిప్పుల్లోకి నెట్టండి...నా ప్రేమకు అగ్నిపరీక్ష
పెట్టండి
నిప్పుల్లో నేను నిలుస్తా...నేను గెలుస్తా...
నా ప్రియున్ని ప్రేమదేవతను పిలుస్తా...
మాది నిజమైన ఓ స్వచ్చమైన ప్రేమని...
నేనొక భగ్న ప్రేమికురాలినని నిరూపిస్తా...
3...
సారీ వెరీ సారీ ఇప్పుడే వాడు
మేసేజ్ పెట్టి కాల్ కట్ చేశాడు
నాది "వన్ సైడ్ లవ్" అంటూ
నాకు వాడికి ఏ సంబంధం లేదంటూ...
ఒక్క ఈ "సెల్ ఫోన్ సంబంధం" తప్ప...
అయ్యో..! అయ్యో..!
ఎంత దగా..? ఎంత దగా..?
ఎంత మోసం..? ఎంత మోసం..?
సెల్లో మెసేజ్ లన్నీ...
చేసుకున్న బాసలన్ని...
చెప్పుకున్న ఊసులన్ని...
కలిసి పిచ్చి పిచ్చిగా
రెచ్చిపోయి తీసుకున్న
ఫోటోలన్నీ డిలీట్ అయ్యాయే..!
అయ్యో ఇప్పుడే తెలిసింది
సెల్ ఫోన్ ప్రేమ ఒక ఫేక్ ప్రేమని...
వాడు ప్రేమంటే ఏంటో తెలియని...
ఒక పిచ్చివాడని పచ్చిమోసగాడని...
"కలలో' కూడా ఊహించలేదు
నేను వాడి "వలలో" చిక్కుకుని
ఇంత ఘోరంగా మోసపోతానని...
ఇలా ఒక కదలని"శిలనై" పోతానని...
కడలిఅలల్లో ఒక "అలనై" పోతానని...



