Facebook Twitter
మీ నమస్కారమే...మీ సంస్కారం..!

ఒక మంచి మనిషి
ఎదురు పడినప్పుడు
నరుడే నారాయణుడనే
భక్తి భావం మీలో చిగురిస్తే...
అప్పుడేమి వింత
జరుగుతుందో మీకు తెలుసా..?

చిరునవ్వుల
...మీ పలకరింపుతో...
చేతులు జోడించి చేసే
...మీ నమస్కారంతో...
అభిమానంతో అందించే
...మీ కరచాలనంతో....
గాఢంగా హృదయానికి హత్తుకునే
...మీ ఆత్మీయ ఆలింగనంతో..

ఆ ఎదుటి మనిషికి
ఎంతటి ఆత్మతృప్తి...
ఎంతటి ఆనందం...
ఎంతటి సంతోషం...
కలుగునో ఎవరికెరుక...
అనుభవించిన ఆ వ్యక్తి
అంతరంగానికి తప్ప...
అప్పుడేమి వింత
జరుగుతుందో మీకు తెలుసా..?

ఆ వ్యక్తి పెదవులపై ఒక
చిరుమందహాసం చిందులేస్తుంది
ముఖమంతా కాంతివంతమౌతుంది
కళ్ళల్లో కృతజ్ఞత తొంగి చూస్తుంది
మనసులో శాంతి ప్రవహిస్తుంది
అతని గుండెల్లో అంతులేని
ప్రశాంతత గూడుకట్టుకుంటుంది...
ఇదంతా మీరు సంస్కారంతో చేసిన
ఆ "నమస్కారం" మహిమ...మాయే
అప్పుడేమి వింత
జరుగుతుందో మీకు తెలుసా..?

త్రికాలలో మీ
సంస్కారానికి ఇక తిరుగుండదు...
త్రిశూల శక్తులు మీ వశమౌతాయి...
త్రినేత్రుడైన ఆ శంకరుని
కరుణా కటాక్ష వీక్షణాలు
మీపై కుంభవర్షమై కురుస్తాయి...