ఆభరణాలే...ఆయుధాలు...?
మనసులో
మంచితనం...
గుండెల్లో
కొండంత ధైర్యం...
పెదవులపై
చెరగని చిరునవ్వు...
నిప్పులాంటి
నీతి నిజాయితీ...
హృదయం నిండా
పొంగి పొర్లే ప్రేమ...
ఈ ఐదు ప్రతి మనిషికి
పెట్టని...ఆభరణాలంటారు
అవి ధరిస్తే...
ఆ ఆనందం...వర్ణనాతీతం
ఆ అందం...అఖండ దైవస్వరూపం
అవి కొందరికి...ఆయుధాలు
అవి ధరిస్తే...జీవితంలో వారు
ఓటమినెరుగని విశ్వవిజేతలు...
అవి కొందరికి...పంచామృతం
అది సేవించిన వారికి పంచభూతాలు
సైతం సలాంచేస్తాయి గులాంలౌతాయి



