నీ చుట్టూ నిరాశా
నిస్పృహలు నిట్టూర్పులు
కారుమబ్బుల్లా కమ్మిన వేళ
ఓదార్చి సంతోషామృతాన్ని పంచే
ఆ "సహృదయులు"...కావాలి
ఎన్నో సుత్తి దెబ్బలు కొట్టి
ఎన్నో కష్ష్టాల కత్తుల్తో పొడిచి
ఎన్నో మానని గాయాలు చేసి
ఎన్నో అనుభవాలను అందించే...
ఆ "దుష్టులు దుర్మార్గులు"...కావాలి
జీవితంలో
కక్షా కార్పణ్యాలతో
అసూయా ద్వేషాలతో పగా
ప్రతీకారాలతో రగిలిపోతూ
పాఠాలను గుణపాఠాలను నేర్పే
ఆ "బద్ద శత్రువులు"...కావాలి
కష్టాలలో కార్చే కన్నీటిని
తుడిచి కొండంత అండగా
ఉంటూ ఎన్నడూ మరిచిపోలేని
తీపి జ్ఞాపకాలనందించే...
అవసరమైతే ప్రాణాలనర్పించే...
ఆ "ప్రాణ స్నేహితులు"...కావాలి
ఔను "ఈ నలుగురు" కావాలి
కడవరకు తోడుండి కన్నుమూస్తే
కాటికి చేర్చే "ఆ నలుగురు" రావాలి.
ఇదే జీవితం...అది
భిన్నత్వంలో ఏకత్వం..!
ఉండరాదు జీవితంలో
శాశ్వతమైన శత్రుత్వం..!
ఉండాలి ప్రతిమనిషిలో
స్వచ్చమైన వ్యక్తిత్వం..!
దయాగుణం దాతృత్వం..!
పరిమళించే ప్రేమతత్వం..!
మచ్చలేని మంచితనం....మానవత్వం..!
అదే మనిషి మనిషిలో దాగిన దైవత్వం..!



