Facebook Twitter
అన్నిదానముల కన్న..! విద్యాదానమే మిన్న...!

1...

గో...దానం 

భూ...దానం

అన్న...దానం

వస్త్ర...దానం 

గృహ...దానం 

విద్యా...దానాలలో ఏది మిన్న...

అన్ని దానములకన్న 

"గోదానం"...నిన్ననే...కానీ  

కొద్దిరోజులకే పాలిచ్చే ఆ

గోమాత వట్టి పోవును ఆపై

పోషించుట పెనుభారమౌను...

ఆ గోదానం కన్న 

"భూదానం"...మిన్ననే...

పంటలు పండించవచ్చు ...

కడుపులు నింపవచ్చు...కాని...

భూఘర్షణలు జరిగితే పగా 

ప్రతీకారాలతో ఒకరినొకరు 

కత్తులతో పొడుచుకొందురు 

కసితో ప్రాణాలు తీసుకొందురు

ఆ భూదానం...కన్న...

"అన్నదానం"...మిన్ననే

కానీ...తిన్న అన్నం 

తక్షణమే అరిగిపోయేను ఆపై 

ఆకలితో కడుపు రగిలిపోవును

2...

ఆ అన్నదానము కన్న

"వస్త్రదానం"...మిన్ననే

కాని...కొద్ది రోజులకే 

ధరించినా దాచిఉంచినా ...

వస్త్రం చిల్లులు పడును...  

చివరకు చిరిగిపోవును... 

ఆ వస్త్రదానం కన్న

"గృహదానం"...మిన్ననే

కాని...కొద్ది రోజులకే 

ఆ గృహం కూలిపోవచ్చును 

అగ్నికి ఆహుతి కావచ్చును 

కానీ అరిగిపోక...చిరిగిపోక...

కూలిపోక...అగ్నికి కాలిపోక...

వట్టి పోక...పరులపాలు కాక...  

ప్రాణాలు...గాలిలో కలిసిపోక...

దొంగలచే దోచుకోబడక...

తరతరాలకు తరిగిపోక...

అక్షయపాత్రగా చిరకాలం మిగిలేది 

అన్ని దానములకన్న మిన్నగా నిలిచేది 

విద్యాదానమే అది ఆ సరస్వతీదేవి వరమే